1984 ఊచకోత: సజ్జన్‌కు ఊరట, జడ్జి పైకి చెప్పు

ఈ కేసులో సజ్జన్ కుమార్‌తో పాటు మరో ఐదుగురిని న్యాయస్థానం గతంలో నిందితులుగా పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటించింది. మిగిలిన ఐదుగురిని దోషులుగా చెప్పింది. వారికి మరణ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
న్యాయమూర్తి సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటించగానే ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయమూర్తి పైకి చెప్పు విసిరాడు. కోర్టు తీర్పుపై సిక్కులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానం ఎదుటకు పెద్ద మొత్తంలో వచ్చిన సిక్కులు ఆందోళన చేపట్టారు. కోర్టు తీర్పు సరిగా లేదని ఆక్షేపించారు.












Click it and Unblock the Notifications