సాయి బెదిరింపులు, అందుకే విచారణ ఆలస్యం: సిబిఐ

పెట్టుబడులు, నిధుల ప్రవాహంలో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. ఎపిలో సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించి జగతిలో రూ.5 కోట్ల పెట్టుబడులు పెట్టించారన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా సాయి బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. సాయి బయట ఉంటే సాక్ష్యులను బెదిరిస్తారన్నారు. సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారన్నారు. అసంబద్ద కారణాలతో సాయి బెయిల్ పొందారన్నారు.
జగన్‌ను అరెస్టు చేయలేదన్న కారణంతో గతంలో సాయికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. ఇది సహేతుకమైన కారణం కాదన్నారు. అసంబద్ద కారణాలతో బెయిల్ పొందారని, దానిని రద్దు చేయాలని కోరారు. సిబిఐ దర్యాఫ్తునకు విజయ సాయి రెడ్డి అవరోధం కలిగిస్తున్నారన్నారు. వాంగ్మూలం ఇచ్చే సంస్థలను సాయి బెదిరించినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
సాక్ష్యులను ప్రభావితం చేయడం వల్లనే దర్యాఫ్తు ఆలస్యమవుతోందన్నారు. సిబిఐ వాదనలు అనంతరం కోర్టు బిటిషన్ పైన విచారణనను గురువారానికి వాయిదా వేసింది. విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పైన రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications