ఢిల్లీలో మళ్లీ భూప్రకంపనలు: ఇళ్లలోంచి జనం పరుగులు

North India
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ సహా ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. నోయిడా, శ్రీనగర్, పంజాబ్, చండీగఢ్, వాఘా సరిహద్దుల్లో భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఇవి వచ్చాయి.

ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. అయితే భూ ప్రకంపనలకు అపార్టుమెంట్లు, ఇళ్లలోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టరు స్కేలు పైన 5.8గా నమోదయింది. భూకంప కేంద్రం హిమాచల్ - కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించారు.

ఉత్తర భారత దేశంలో ఇటీవల వరుసగా భూప్రకంపనలు వస్తున్నాయి. వారం రోజుల క్రితం న్యూఢిల్లీతో పాటు కాశ్మీర్‌లో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలు పైన 5.7గా నమోదయింది. ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగడంతో ఢిల్లీలో, కాశ్మీర్‌లో ప్రజలు భయానికి గురై ఇళ్ల నుండి బయటకు వచ్చారు. హిందూకుష్ పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

అంతకుముందు పదిహేను రోజుల క్రితం కూడా కంపనలు వచ్చాయి. భూమి ఒక్కసారిగా కంపించడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు భయానికి గురై ఇళ్ల నుండి, అపార్టుమెంటుల నుండి, కార్యాలయ నుండి బయటకు వచ్చారు. మధ్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ ప్రాంతాల్లో భూమి కంపించింది. నోయిడాలోను భూమి కంపించింది. దాదాపు పది నుండి ఇరవై సెకన్ల మధ్య ఆయా ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా చెబుతున్నారు.

రిక్టర్ స్కేలు పైన ఇది 5.6గా ఉంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో భవంతులు పడిపోతాయేమోనని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశంలోని నోయిడా, ఛండీగఢ్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోను భూమి కంపించింది. అప్పుడు పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లోను భూకంపం వచ్చింది. ఈ దేశాల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు పైన 7.8గా ఉంది. భూకంప కేంద్రం పాకిస్తాన్ - ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించారు.

ఇరాన్ లోని ఖాష్‌లో పదిహేను కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్, గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్, భారత్‌లపై భూకంప ప్రభావం పడింది. ఇరాన్‌ను ఈ భారీ భూకంపం వణికించింది. ఖాష్ పట్టణంలో దాదాపు నలబై మంది వరకు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పలు భవంతులు కుప్పకూలాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు. భూకంపం కారణంగా పాక్‌లో ఐదుగురు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+