వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: చంద్రబాబుకు దాడి, వైయస్ జగన్‌కు రెహ్మాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ys Jagan and Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి విశాఖపట్నం సీనియర్ నేత దాడి వీరభద్ర రావు షాక్ ఇవ్వగా, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్సీగా పనిచేసిన దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ టికెట్ తనకు ఇవ్వకపోవడంపై అలిగిన దాడి వీరభద్ర రావు కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

విశాఖపట్నంలో జరిగిన చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగింపు సభకు కూడా దాడి వీరభద్రరావు దూరంగా ఉన్నారు. దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ పదవీకాలం గురువారంనాటితో ముగిసింది. తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడానికి దాడి వీరభద్రరావు రేపు (శుక్రవారం) అనకాపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. దాడి వీరభద్ర రావు స్థానంలో ఎమ్మెల్సీ టికెట్‌ను చంద్రబాబు యనమల రామకృష్ణుడికి ఇచ్చారు.

యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే విషయంపై కనీసం తనతో మాట్లాడలేదని దాడి వీరభద్రరావు అలిగారు. తనను సంప్రదించకపోవడాన్ని ఆయన అవమానంగా భావించారు. దీంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కాగా, మోత్కుపల్లి నర్సింహులుతో విభేదాలతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన వరంగల్ జిల్లా సీనియర్ నేత కడియం శ్రీహరి గురువారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. తాను టిడిపిలోనే ఉంటానని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతాననే ప్రచారంలో నిజం లేదని కడియం శ్రీహరి చెప్పారు.

రెహ్మాన్ తిరుగుబాటు

మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై తిరుగుబాటు ప్రకటించారు. పార్టీ సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. రెహ్మాన్ తీరుకు పార్టీ సీనియర్ నేతలు సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ అవాక్కయ్యారు. పార్టీ సమన్వయ కమిటీల్లో ముస్లింలు లేకపోవడంపై ఆయన విమర్సలు చేశారు. రెహ్మాన్ అనే పేరు పెట్టుకుంటే లాభం లేదని, రెహ్మాన్ రెడ్డి అని పేరు పెట్టుకుంటే ప్రయోజనం ఉండేదేమోనని రెహ్మాన్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో లుకలుకలు ఒక్కటొక్కటే బయపడుతున్నాయి.

English summary
It is said that former MLC Dadi Veerabhadra Rao has resigned from Nara Chandrababu Naidu's Telugudesam party and former MLC Rehman lashed out at YS Jagan's YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X