వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగరెట్ కోసం హత్య చేశాడు: జీవిత ఖైదీగా జైలుకు..

By Pratap
|
Google Oneindia TeluguNews

Cigarette
న్యూఢిల్లీ: సిగరెట్ కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన యువకుడికి జీవిత ఖైదు పడింది. మానవుడి విలువ తెలియడం లేదని వ్యాఖ్యానిస్తూ ఢిల్లీ కోర్టు ఆ యువకుడి కఠిన కారాగార శిక్ష విధించింది. పాతికేళ్ల రాకేష్ సూరజ్ అనే వ్యక్తిని కత్తితో పొడిచాడు. దీంతో సూరజ్ మరణించాడు. ఈ కేసులో రాకేష్‌కు జైలు శిక్ష పడింది. పేదల నుంచి డబ్బులు లాక్కునే అలవాటు కూడా రాకేష్‌కు ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

మనుషులంటే నిందితుడికి లెక్క లేదని, పొట్ట పోసుకోవడానికి ఢిల్లీ వచ్చిన 32 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు తీశాడని, పేద వ్యక్తి నిందితుడికి సిగరెట్ ఇవ్వలేకపోయాడని, దానికి ప్రాణాలు తీశాడని అదనపు సెషన్స్ జడ్జి కామిని లావువా అన్నారు. దోషికి కోర్టు 15 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.

సంఘటన 2010 నవంబర్ 27వ తేదీన సుల్తాన్‌పురి ప్రాంతంలో జరిగింది. తన బంధువులతో కలిసి సూరజ్ మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తూ బీడీ తాగుతున్నారని, అది చూసి తనకు ఓ సిగరెట్ ఇవ్వాలని రాకేష్ అడిగాడని, తన వద్ద సిగరెట్లు లేవని సూరజ్ చెప్పాడని, దాంతో చంపుతానని రాకేష్ బెదిరించాడని కేసు నమోదైంది.

సిగరెట్ ఇవ్వకపోవడంతో రాకేష్ కత్తి తీసి సూరజ్‌ను పొడిచాడు. కాస్తా దూరంలో సూరజ్ బంధువులు రాకేష్‌పైకి ఇటుకలు విసిరారు. రాకేష్ అక్కడి నుంచి పారిపోయిన తర్వాత సూరజ్‌ను బంధువులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడు.

English summary
A youth, who had murdered a man for failing to give him a cigarette, has been sentenced to rigorous life imprisonment by a Delhi court which said he has no value of a human being.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X