భారత్‌కు సరబ్ మృతదేహం: పాక్‌పై సోదరి మండిపాడు

 Pakistan must account for Sarabjit Singh's death, says govt
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్ జైలులో తోటి ఖైదీల చేతిలో గాయపడి బుధవారం అర్ధరాత్రి మృతి చెందిన సరబ్‌జిత్ సింగ్ మృతదేహాన్ని భారత్‌కు అప్పగించేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. శవ పరీక్ష అనంతరం భారత హైకమీషనర్ కార్యాలయానికి సరబ్ మృతదేహాన్ని పాక్ అప్పగించనుంది.

సరబ్ మృతిపై ప్రధాని సంతాపం

సరబ్ మృతికి కారణమైన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. మృతదేహాన్ని దేశానికి తీసుకు వచ్చేందుకు తాము చర్యలు చేపడుతున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు.

కుటుంబ సభ్యులకు హోంమంత్రి పరామర్శ

సరబ్ కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం ఉదయం పరామర్శించారు. సరబ్ మృతి అత్యంత విషాదకరమైనదన్నారు. మృతదేహాన్ని భారత్‌కు తీసుకు రావడం కోసం విదేశాంగ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. కుటుంబానికి న్యాయం చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

విచారణ జరపాలన్న ప్రకాశ్ సింగ్ బాదల్

సరబ్ మృతిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు.

ఉద్దేశ్యపూర్వక హత్యగా భావిస్తున్నామన్న మనీష్ తివారీ

సరబ్‌ది కుట్రపూరిత హత్యగానే తాము పరిగణిస్తున్నామని, ఉద్దేశ్యపూర్వకంగానే హత్య చేసినట్లుగా భావిస్తున్నామని కేంద్రమంత్రి మనీష్ తివారి అన్నారు. సరబ్ పట్ల పాక్ వైఖరి అమానవీయమనన్నారు. అతని వ్యవహారంపై పాక్ ప్రధానితో పదిహేను నెలల క్రితమే మన్మోహన్ మాట్లాడారని, మానవీయ కోణంలో సరబ్‌ను విడుదల చేయాలని అప్పుడే కోరారన్నారు. విదేశీ ఖైదీల పట్ల వ్యవహరించే తీరులో పాక్ వైఖరి సరిగా లేదన్నారు. జెనీవా ఒప్పందాలను పాక్ ఉల్లంఘించినట్లుగా అర్థమవుతోందని, ఈ ఘటనను రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

దేశభక్తుడిగా ప్రకటించాలి

సరబ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వమే హత్య చేసిందని ఆయన సోదరి దల్బీర్ సింగ్ ఆరోపించారు. ఆయన మృతి తమ కుటుంబానికి తీరని లోటని, నిర్దోషికి ఎప్పుడు శిక్ష పడదని, హత్య జరుగుతుందని, సరబ్ ముందే చనిపోయినా వైద్యులు చెప్పకుండా దాచిపెట్టారన్నారు. భారత ప్రజల పట్ల పాక్ వైఖరి మొదటి నుంచి అభ్యంతరకరంగా ఉందన్నారు.

అమాయకుడిని బలి తీసుకున్న పాక్ ఎప్పటికీ మారదన్నారు. భారత ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే సరబ్ మరణించి ఉండేవాడు కాదన్నారు. 2005 నుంచి తాము చేస్తున్న అభ్యర్థనలను ప్రభుత్వాలు పట్టించుకొని ఉంటే సరబ్ హత్య జరిగి ఉండేది కాదన్నారు. భారత్ అంతా ఒక్కతాటిపై నిలబడాలని, పాక్ ఆకృత్యాలపై కులమతాలకు అతీతంగా స్పందించాలన్నారు. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకోవాలన్నారు. సరబ్‌ను దేశభక్తుడిగా ప్రకటించాలని పలువురు డిమాండ్ చేశారు.

మరోవైపు సరబ్ మృతిపై పాకిస్తాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సరబ్ పై దాడి చేసిన వారిపై ప్రభుత్వం హత్యా నేరం కింద కేసును నమోదు చేసింది. ఇద్దరి నిందితులపై తొలుత దాడి కేసు పెట్టిన అధికారులు ఇప్పుడు హత్య కేసు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+