ఒక్కటయ్యారు: కిరణ్‌పై బొత్స ఫిర్యాదు, పేపర్ కటింగ్స్..

మంత్రులు జానా రెడ్డి, వట్టి వసంత్ కుమార్, డిఎల్ రవీంద్రా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులతో బొత్స నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న బొత్స నివేదికలో పొందు పర్చారు. మరికొందరు మంత్రుల అభిప్రాయాలను కూడా బొత్స ఫోన్ ద్వారా సేకరించినట్లుగా సమాచారం. కిరణ్ తీరు పట్ల పలువురు మంత్రులు తమ అసంతృప్తిని బొత్స ఎదుట వ్యక్తం చేశారట. వారి అభిప్రాయాలనే నివేదికలో బొత్స పొందుపర్చారు.
వీటికి తోడు పలు దిన పత్రికలలో వచ్చిన పేపర్ కటింగ్స్‌ను కూడా నివేదికకు జతపర్చినట్లుగా సమాచారం. ఇటీవల బయ్యారం గనుల విషయంలో ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును సవాల్ చేస్తూ మెదక్ జిల్లాలో మాట్లాడారు. అది తమను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టిందని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు.
ఇదే విషయాన్ని వారు బొత్సకు చెప్పినట్లుగా సమాచారం. కెసిఆర్‌కు సవాల్ చేయడం ద్వారా తాము మరింత చిక్కుల్లో పడ్డామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారట. ఈ నివేదికను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌కు పంపినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications