విజయమ్మ‌తో భేటీ: వైయస్ జగన్ పార్టీలోకి దాడి?

Dadi Veerabhadra Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ససార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నాయి. వైయస్ జగన్ పార్టీలో చేరేందుకు వీరభద్రరావు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నట్టే. గురువారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రాజీనామా లేఖను మెయిల్‌లో పంపిన దాడి వీరభద్రరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మిని మాత్రం స్వయంగా కలుసుకున్నారు.

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో శుక్రవారం జగన్‌ను కలిసి మిగతా విషయాలు మాట్లాడుకోనున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈనెల 6న విజయలక్ష్మి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. విశాఖలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని, కొణతాలతో సఖ్యతతో పనిచేస్తానని హామీ ఇచ్చి, తన కుమారుడు రత్నాకర్‌కు అనకాపల్లి లేదా విశాఖ పశ్చిమసీటు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి.

అయితే, దాడి వీరభద్రరావు మాత్రం ఈమధ్య మంత్రి గంటా శ్రీనివాసరావును కలుసుకోవడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. అదే సమయంలో 'కిరణ్‌కుమార్ రెడ్డి టచ్‌లో ఉన్నారు' అని దాడి కుమారుడు రత్నాకర్ అంటున్నారు. దాడి చూపు కాంగ్రెస్ వైపు ఉన్నదనే ఊహాగానాలు వస్తున్నాయి.

అయితే, దాడి వీరభద్రరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండోసారి శాసనమండలికి నామినేట్ చేయకపోవడంతో దాడి వీరభద్రరావు అలిగారు. దాంతో ఆయన టిడిపికి గుడ్‌బై చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+