ఈ నెల 6న జగన్ పార్టీలో చేరుతున్నా: ఎమ్మెల్యే కూన

కుత్బుల్లాపూర్ కార్యకర్తల కోరిక, ఒత్తిడి మేరకే తాను వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు చెప్పారు. మళ్లీ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలన రావాలంటే అది కేవలం జగన్ ఒక్కడి వల్లనే సాధ్యమని ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్ర రావు కూడా శనివారం చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలువనున్నారు. జగన్‌తో భేటీ అనంతరం ఆయన చెప్పే సమాధానాలకు తాను సంతృప్తి చెందితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానన్నారు. దాడి కూడా ఈ నెల 6న జగన్ పార్టీలో చేరనున్నారు.
ఫుడ్ కోర్టును ప్రారంభించన వైయస్ వివేకా
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానికి చెందిన ఫుడ్ కోర్టును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఎస్ఆర్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఎల్‌వి ఫుడ్ కోర్టును వివేకా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో వివేకాతో పాటు సనత్ నగర్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ శీలం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications