ఇరుకునపడ్డ దాడి: వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు

Tdp Logo
విశాఖపట్నం: జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్ర రావుకు పార్టీ కార్యకర్తల నుండి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన గురువారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మెయిల్ చేశారు. రాజీనామా అనంతరం ఆయన శుక్రవారం ఉదయం అనకాపల్లి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమయంలో చాలామంది కార్యకర్తలు టిడిపిలోనే ఉండాలని నినాదాలు చేశారు.

తెలుగుదేశం పార్టీలో కొనసాగితే సరేనని లేదంటే దాడి వెంట వెళ్లే ప్రసక్తి లేదని పలువురు కార్యకర్తలు ఈ సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉంటే దాడి కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన వెళ్తానంటే మాత్రం తమ సహకారం ఉండదని పలువురు తేల్చి చెప్పినట్లుగా సమాచారం. కార్యకర్తల నినాదాల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేశారట.

వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలువబోతుందని అందుకే తాను ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారట. ఆయన వ్యాఖ్యలతో విభేదించిన కార్యకర్తలు ఘాటుగానే స్పందించారట. టిడిపియే అధికారంలోకి వస్తుందని పార్టీలో ఉంటే కలిసి వస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారట. ఇంకోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తామని దాడి భావిస్తుండగా ఆ పార్టీలోని సినియర్ నేత కొణతాల రామకృష్ణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.

కాంగ్రెస్ ఆహ్వానం

విశాఖ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాడి రాకను వ్యతిరేకిస్తుండటం, తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని కార్యర్తలు ఒత్తిడి చేస్తుండగా కాంగ్రెసు మాత్రం ఆయనకు ఆహ్వానం పలుకుతోంది. మంత్రులు గంటా శ్రీనివాస రావు, పసుపులేటి బాలరాజులు దాడి వస్తానంటే ఆహ్వానిస్తామని చెప్పారు.

దాడి రాజీనామా ఊహించిందేనని, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బాలరాజు అన్నారు. టిడిపిలోని ప్రస్తుత విధానాలు నచ్చకనే చాలామంది నేతలు ఆ పార్టీని వీడుతున్నారన్నారు. దాడి వస్తానంటే కాంగ్రెసు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఆయనతో తాను రెండుమూడుసార్లు మాట్లాడానన్నారు. మనస్తాపంతోనే ఆయన తెలుగుదేశం పార్టీని వీడారన్నారు.

జగన్‌తో భేటీ తర్వాతే నిర్ణయం!

ఇన్ని ఒత్తిడిల మధ్య దాడి వీరభద్ర రావు రేపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాతనే ఓ నిర్ణయం తీసుకోనున్నారట. రేపు ఆయన జైల్లోని జగన్‌ను కలిసి తన తనయుడికి నియోజకవర్గంపై హామీ, తనకు పార్టీలో ప్రాధాన్యత గురించి చర్చించిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశముందంటున్నారు. పార్టీ అధిష్టానం నుండి హామీలు వచ్చినా జగన్ నుండి రావాలనే వాదన ఇంతకుముందు ఉన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+