అమ్మాయిలతో వస్తే పబ్బుల్లో ఫ్రీడ్రింక్స్ ఆఫర్లు వద్దు

అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు వస్తే ఫ్రీ డ్రింక్స్ వంటి ఆఫర్లను ఇవ్వవద్దని ఆదేశించింది. అమ్మాయిలతో వస్తే మందు ఫ్రీ వంటి ఆఫర్లకు బ్రేక్స్ వేయాలని చెప్పింది. ఇక నుండి అలాంటి ఆఫర్లు ఇస్తే కేసులు బుక్ చేస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అర్ధరాత్రి దాకా లేడీస్ పార్టీలు ఉండకూడదని చెప్పింది.
ఇటీవల పబ్బులపై, క్లబ్బులపై పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల పబ్బుల్లో, క్లబ్బుల్లో తాగి వచ్చిన అమ్మాయిలు అర్ధరాత్రి నడి రోడ్డు పైన ఇష్టారీతిగా వ్యవహరించడం, ఫ్రీడ్రింక్స్ పేరుతో అమ్మాయిలను యువకులు తీసుకు వెళ్లడం ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఎక్సైజ్ శాఖ నిర్ణయాన్ని యజమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అమ్మాయిలతో కలిసి వస్తే ఫ్రీ డ్రింక్స్ ఆఫర్ చేయడం, రాత్రి పది దాటే వరకు యువతులను ఉంచని పక్షంలో క్లబ్‌లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారట.












Click it and Unblock the Notifications