రాహుల్ 'గాంధీ'కి మోడీ చురక: సోనియాకు అహంకారం

మంగళూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. తాను జాతిపిత మహాత్మా గాంధీ నియమాలను పాటిస్తానని మిస్టర్ గోల్డెన్ స్పూన్ చెబుతుంటారని, కాంగ్రెస్ పార్టీని ధ్వంసం చేయాలని గాంధీజీ భావించే వారని, మరి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ద్వంసం చేస్తారో మిస్టర్ గోల్డెన్ స్పూన్ చెప్పాలని ప్రశ్నించారు.
కర్ణాటకలో అవినీతి ఎక్కువగా ఉందంటున్న రాహుల్.. ఢిల్లీలో 'శిష్టాచార్' ఉందేమో చెప్పాలన్నారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయినందుకు సోనియా ప్రజలకు క్షమాపణ చెప్పి ఉండాల్సిందనీ, కానీ ఆమె అహంకారం ఆ పని చేయనివ్వలేదనీ మోడీ ఆరోపించారు.
కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైపోయాయో చెప్పాలని గురువారం గుల్బర్గా ప్రచారంలో సోనియా వేసిన ప్రశ్నకు సమాధానంగా అదేమైనా వరకట్నంగా ఇచ్చిన సొమ్మా? అని నరేంద్ర మోడీ దెప్పిపొడిచారు. సరబ్‌జిత్ సింగ్ మరణంపై మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనది చాలా పిరికి విదేశాంగ విధానమన్నారు. కాంగ్రెస్ లేని కర్ణాటక, కాంగ్రెస్ లేని భారతదేశం కావాలని పిలుపునిచ్చారు. బెల్గాంలో మరో ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ప్రధానికి కనీసం కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనైనా నోరు తెరవడానికి అవకాశం ఇవ్వడం అదృష్టమేనన్నారు. ఢిల్లీలో ఆయన నోరు తెరిచేందుకు అవకాశం ఇవ్వరని మోడీ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications