పిక్చర్స్: చిరు ఉన్నా, సోనియా సభలో కుర్చీలు ఖాళీ
బెంగళూర్: శానససభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారంనాడు కర్ణాటక రాజధాని బెంగళూర్ వచ్చారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ జరనున్న విషయం తెలిసిందే. అయితే, సోనియా సభకు ప్రజలు ముఖం చాటేసినట్లు కనిపించారు.
బెంగళూర్‌లోని ప్యాలెస్ గ్రౌండ్‌లో సోనియా బహిరంగ సభ ఏర్పాటైంది. లక్ష మంది ఆ మైదానంలో పడుతారు. అయితే, సోనియా సభకు మైదానం నిండలేదు. చాలా కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఈ సంఘటన నుంచి గుణపాఠం తీసుకోవాలని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. దాన్ని వారు ప్రజల హెచ్చరికగా భావించి ఆందోళనకు గురవుతున్నారు.
వచ్చే శానససభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు తెలియజేస్తున్నాయి. రాజకీయ నిపుణులు కూడా అదే అంచనా వేస్తున్నారు. ప్రజలు బిజెపి పాలనతో విసిగిపోయారని, కాంగ్రెసు పార్టీని గెలిపించడానికి సిద్ధపడ్డారని అంటున్నారు. అయితే, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సభకు ప్రజలు పెద్ద యెత్తున రాకపోవడంపై కాంగ్రెసు నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. అందుకు ఎండలను వారు సాకుగా చూపుతున్నారు.

బెంగళూర్ పర్యటన సందర్భంగా పార్టీ కర్ణాటక ఇంచార్జీతో సోనియా గాంధీ మాట్లాడుతూ కనిపించారు. ఆమె ఎన్నికల ప్రచారం కోసం గురువారం బెంగళూర్ వచ్చారు. సభలో ఖాళీ కుర్చీలపై ఆరా తీస్తున్నారా అనేట్లు అలా..

కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సోనియా గాంధీ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు జి. పరమేశ్వరతో మాట్లాడారు.

ఎన్నికల ప్రచార సభలో అభివాదం చేస్తున్న సోనియా గాంధీ..

బెంగళూర్ ప్యాలెస్ గ్రౌండ్ ఎన్నికల ప్రచార సభలో సోనియా గాంధీ ఇలా..

సోనియా గాంధీ, ఇతర కాంగ్రెసు నాయకులతో కలిసి ప్రజలకు సభావేదిక మీది నుంచి అభివాదం చేస్తూ ఇలా..

సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు చిరంజీవి, కె రహ్మాన్ ఖాన్, ఇతర కాంగ్రెసు నాయకులు సభా వేదిక మీద ఇలా..

రాజాజీ నగర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెసు అభ్యర్థి మంజులా నాయుడు సోనియా గాంధీ ఆశీస్సులు తీసుకుంటూ ఇలా...












Click it and Unblock the Notifications