కెసిఆర్ ఏమిటో చెప్తా, అనుభవాలు వివరిస్తా: చాడ

తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెరాసలోకి వస్తారంటూ కేసిఆర్ ప్రచారం చేస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ స్వయంగా తానే కలుస్తానని, పార్టీలో తనకు ఎదురైన అనుభవాలను వారికి తెలియజేస్తానని చెప్పారు. కెసిఆర్ వైఖరి, పార్టీలోని పరిస్థితులను కూడా వారికి వివరిస్తానన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై తెరాస నేతలు చాలా మంది అసంతృప్తి వ్యక్తంచేశారని చెప్పారు.
తాను ఏ తప్పు చేయలేదని, కెసిఆర్ దగ్గరకు వెళ్లి మాట్లాడేది లేదని వారికి చెప్పానని అన్నారు. అకారణంగా విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తేనే తాను కెసిఆర్‌తో మాట్లాడతానని వారికి తెలిపానని చెప్పారు. వరంగల్‌లో తెరాస నిర్వహించిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో తన భాగస్వామ్యం చూసిన కెసిఆర్, తనంతట తాను తనకు మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో పనిచేసుకోమని చెప్పారని అన్నారు. వరంగల్ సభ విజయం అయిన తర్వాతే పార్టీలోకి వలసలు పెరిగిన విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చాడ సురేష్ రెడ్డి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి తెరాస టికెట్ ఇస్తానంటూ ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల అధిపతి నుంచి కెసిఆర్ భారీ మొత్తాన్ని బయానాగా పుచ్చుకోవటం వల్లనే తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని బహిష్కృత తెరాస రాష్ట్ర కార్యదర్శి మేకల సారంగపాణి ఆరోపించారు. ఒకవేళ తాము తెలుగుదేశంలో చేరుతామనే సమాచారం ఉంటే, పిలిచి మాట్లాడాలని, లేకపోతే షోకాజు నోటీసు ఇవ్వాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications