ఊహించిన జగన్ కాదు, వేరే: జైల్లో భేటీ తర్వాత దాడి

వైయస్ జగన్ తనకు ఇచ్చే హామీలను బట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను చేరే విషయం ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. దాడి తనయుడు రత్నాకర్‌కు విశాఖ వెస్ట్ సీటు ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జగన్‌తో చంచల్‌గుడా జైలులో ఆయన దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు. వైయస్ జగన్ ఆహ్వానించారని, తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని ఆయన చెప్పారు.
తమ పార్టీల్లోకి రావాలని గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చిరంజీవి తనను ఆహ్వానించారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనను వద్దనుకుంటున్నారని, అందువల్ల టిడిపిలో కొనసాగడం అనవసరమనే నిర్ణయానికి వచ్చానని, టిడిపిలో తనకు తగిన ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆయన అన్నారు.
జగన్ ఓ శక్తి అని, దృఢ సంకల్పం ఉన్న నాయకుడని ఆయన అన్నారు. తాను ఊహించిన, విన్న జగన్ వేరు, తాను చూసిన జగన్ వేరని ఆయన అన్నారు. 11 నెలలుగా జైలులో ఉన్నా ప్రజలకు మేలు చేయాలనే కసి జగన్‌లో కనిపించిందని ఆయన ప్రశంసించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం జరుగుతోందని, ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు. జగన్‌తో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు తెలిశాయని ఆయన అన్నారు.
త్వరలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని ఆయన చెప్పారు. తాను గతంలో టిడిపి తరఫున లక్ష కోట్ల అవినీతిపై మాట్లాడానని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత వివరాలు ఇస్తానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాలతోనే తాను గతంలో వైయస్, జగన్‌లపై ఆరోపణలు చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications