అర్థరాత్రి దాటాక కూడా తాగొచ్చు: యువతకు బిజెపి

బెంగళూర్‌లో ఆర్థరాత్రి దాటే బార్లు తెరిచి ఉంచేందుకు, ఆహార పదార్థాలను వడ్డించేందుకు అనుమతి ఇస్తామని చెప్పింది. బార్లను అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తామని చెప్పింది. ప్రస్తుతం రాత్రి గం.11.30 నిమిషాలకు బార్లను మూసివేయిస్తున్నారు.
దేశ ఐటి హబ్‌గా అవతరించిన బెంగళూర్‌లో బార్లను, రెస్టారెంట్లను అర్థరాత్రి దాటే వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. రాష్ట్రానికి చెందినవారే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. బెంగళూర్ విదేశీ విద్యార్థులకు, ఉద్యోగులకు ఆశ్రయం ఇస్తోంది.
ఏప్రిల్ 19వ తేదీన విడదల ఎన్నికల ప్రణాళికలో పార్టీ ఆ హామీ ఇచ్చింది. బెంగళూర్‌లో 28 శాసనసభా స్థానాలున్నాయి. 2008 ఎన్నికల్లో బిజెపి 17 స్థానాలను గెలుచుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి తగిన ఫలితాలు సాధించలేదు. దీంతో శాసనసభ ఎన్నికల్లో యువతను ఆకట్టుకుని అధిక స్థానాలను గెలుచుకోవడానికి అర్థరాత్రి దాటిన తర్వాత బార్లను తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తామని హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications