పురంధేశ్వరి ఫోన్: విగ్రహావిష్కరణకు బాలకృష్ణ, ఎన్టీఆర్

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారు. తెలుగుదశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు స్పీకర్ నుండి తొలుత లేఖ వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, స్పీకర్ నుండి లేఖ రాలేదని సమాచారం. దీంతో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై టిడిపి తర్జన భర్జన పడింది. ఈ విషయమపై పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
హాజరైతే ఎలా ఉంటుంది? హాజరు కాకుంటే ఏమవుతుంది? అనే విషయమై తర్జన భర్జన పడ్డాయి. దివంగత స్పీకర్ బాలయోగి స్పీకర్‌గా ఉన్నప్పటి నుండి తాను ఎన్టీఆర్ విగ్రహ స్థాపన కోసం ప్రయత్నాలను చేశానని బాబు నేతలతో చెప్పారు. కేంద్రమంత్రిగా మాత్రమే పురంధేశ్వరికి అనుమతించారని, కుటుంబ సభ్యులకు అనుమతిస్తే బాగుండేదని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. బాబుకు ఆహ్వానం రాకపోవడంపై టిడిపి వర్గాలు గుర్రుగా ఉన్నాయి. తర్జన భర్జన అనంతరం బాలకృష్ణ వెళ్లనున్నారు.
కాగా, ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో మురసోలి మారన్ విగ్రహం ఎదురుగా ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ విగ్రహం ఢిల్లీకి చేరుకుంది. స్పీకర్ మీరా కుమార్ ఎల్లుండి ఆవిష్కరించనున్నారు. బాలయ్య, పురంధేశ్వరితో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు ఢిల్లీకి చేరుకున్నారు. జాతీయ నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
టిడిపి ఆగ్రహం, స్పీకర్‌తో భేటీ
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందక పోవడంపై టిడిపి మండిపడుతోంది. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు టిడిపి ఎంపీలు స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి బాబుకు ఆహ్వానం రాకపోవడంపై వివరణ అడగనున్నారు. నామా నాగేశ్వర రావు నేతృత్వంలో ఎంపీలు మీరా కుమార్‌ను కలువనున్నారు.












Click it and Unblock the Notifications