దాడి ఎఫెక్ట్: జగన్‌కు గుడ్‌బై యోచనలో కొణతాల వర్గం

కొణతాల వర్గం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం కొణతాల రామకృష్ణ విశాఖలోని అనకాపల్లి నియోజకవర్గం తన కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో కార్యకర్తలు సూచనల మేరకు ఆ తర్వాత ఆయన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. దాడి తనయుడు రత్నాకర్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనకాపల్లి టిక్కెట్ పైన హామీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది కొణతాల వర్గానికి పుండుమీద కారం చల్లినట్లయిందట.
దీంతో పార్టీని వీడాలని కొణతాలకు చాలామంది కార్యకర్తలు సూచిస్తున్నారట. దాడి ఉన్న పార్టీలో ఉండవద్దని, వేరే పార్టీలోకి వెళ్దామని కోరుతున్నారట. దాడి రాకను కొణతాల సోదరుడు పెదబాబు రెండు రోజుల క్రితం వ్యతిరేకించారు. కొణతాల కూడా అసంతృప్తితో ఉన్నప్పటికీ... పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటే
మనోభావాలు దెబ్బతిన్నాయి... కొణతాల
దాడి రాకతో తన అనుచరుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయని కొణతాల రామకృష్ణ అన్నారు. దాడి విషయంలో తాను అధినేత నిర్ణయానికే కట్టుబడి ఉంటానని అయితే, అనుచరులతో మాట్లాడాక తాను మీడియాతో మాట్లాడతానని చెప్పారు.












Click it and Unblock the Notifications