పురంధేశ్వరి ఇష్టమా?: లక్ష్మీ పార్వతి, టిడిపి అసహనం

దీనికి స్పీకర్ మీరా కుమార్ బాధ్యత వహించాలన్నారు. తనకు ఆహ్వానం అందక పోవడంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్, మీరాకుమార్‌లకు తాను లేఖలు రాస్తానని చెప్పారు. తనకు ఆహ్వానం అందకపోవడంపై న్యాయపోరాటం చేస్తానన్నారు. రాజ్యంగ తప్పిదం జరుగుతున్న సుష్మ ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టిడిపి ఆగ్రహం
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందక పోవడంపై తెలుగుదేశం పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు చంద్రబాబుకు ఆహ్వానం అందలేదని చెబుతూ టిడిపి ఎంపీలు సోమవారం ఉదయం స్పీకర్ మీరా కుమార్‌ను కలువనున్నారు.
కాగా, ఎల్లుండి పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనుంది. మీరా కుమార్ దీనిని ఆవిష్కరిస్తారు. ఇందుకోసం పురంధేశ్వరి కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఆమె లేఖలు రాశారు. బాలయ్య హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications