మీవైపే చూస్తున్నారు: చిరుతో సిఆర్సీ ఆసక్తికర వ్యాఖ్య

విశాఖ-భీమిలి బీచ్ కారిడార్ అభివృద్ధికి చిరంజీవి రూ. 45.89 కోట్లు మంజూరు చేసిన సం గతి తెలిసిందే. ఈ పనులకు భీమిలిలో శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భీమిలి బీచ్‌లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో మంత్రి సి.రామచంద్రయ్య మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలంతా చిరు వైపు చూస్తున్నారని, సారథిగా బొత్స ఉన్నారని, ఇక చిరంజీవి సిద్ధం కావాలన్నారు. ఇది తన మనసులో మాట కాదని, ప్రజల కోరిక అని పేర్కొన్నారు. ఈ మాటలకు వేదికపై ఉన్న చిరంజీవి సహా అంతా ముసిముసిగా నవ్వుకున్నారు. బిజెపిని మతతత్వ పార్టీ అంటూ దుయ్యబట్టారు. కాగా, ఇటీవల కర్నాటక ఎన్నికల్లో ప్రజలు చిరును చూసేందుకు భారీగా తరలి వచ్చిన విషయం తెలిసిందే.
కర్ణాటక ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందన్నారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస రావు అధ్యక్షత వహించిన ఈ సభలో బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వట్టి వసంతకుమార్, రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామి రెడ్డి, ప్రభుత్వవిప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, పంచకర్ల రమేశ్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications