టిడిపి ఓడుతుందనే జగన్ వైపు: దాడి, కొణతాలపై క్లారిటీ

Dadi Veerabhadra Rao
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనే తాను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరానని విశాఖపట్నం జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్ర రావు చెప్పారు. ఆయన ఆదివారం ప్రముఖ తెలుగు టివి ఛానల్ ఎన్టీవితో మాట్లాడారు. తాను, కొణతాలలు ఆగర్భ శత్రువులం కాదని, ఆయన వర్గానికి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని తాను జగన్‌కు చెప్పానన్నారు.

తాము అనకాపల్లి సీటును ఆశించడంలో ఏ తప్పు లేదన్నారు. కొణతాల వర్గానికి ఏమిస్తారో ఆ తర్వాత తన వరగానికి ఇచ్చే విషయం ఆలోచించమని జగన్‌కు చెప్పానన్నారు. కొణతాల విషయంలో తాను పార్టీ అధినేతకు ఎలాంటి షరతులు విధించలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు చేసిందేమీ లేదని దాడి ఈ సందర్భంగా మండిపడ్డారు.

ఎన్టీఆర్ కేబినెట్లో తనకు చోటు దక్కకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తనకు మండలి పదవిని ఇచ్చింది చంద్రబాబు కాదని, జిల్లా నేతలు అన్నారు. తెలుగుదేశం ఓడిపోతుందనే తాను పార్టీని వీడానని చెప్పారు. జగన్ అవినీతిపై ప్రశ్నిస్తే ఎవరు అవినీతిపరులు కాదని ప్రజలు ఎదురు ప్రశ్నిస్తున్నారన్నారు. పనికి మాలిన కార్యక్రమాలకు వెళ్లే చంద్రబాబు పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఎందుకు వెళ్లడం లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అధికార కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+