విజయమ్మ ఎదుటే లుకలుకలు: రోడ్డెక్కిన జగన్ పార్టీ

గుంటూరు జిల్లా బాపట్ల కన్వీనర్ నియామకంపై మోదుగుల బసవ పున్నారెడ్డి వర్గం మండిపడింది. దీనిపై జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖరతో మోదుగుల వర్గం వాదనకు దిగింది. బాపట్ల కన్వీనర్‌గా నియమించిన వ్యక్తి గతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని తీవ్రంగా విమర్శించారని, ఇప్పుడు ఆయనను ఎలా నియమిస్తారని మోదుగుల వర్గం మర్రిని ప్రశ్నించింది.
అతనిని తొలగించాలని మహిళా నగారా వద్ద ఆందోళనకు దిగింది. బాపట్ల కన్వీనర్‌గా రఘుపతిని నియమించారు. ఇతను వైయస్ తీవ్రంగా వ్యతిరేకించిన వారు అని మోదుగుల వర్గం మండిపడుతోంది. ఆయనను తొలగించే వరకు ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లాలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఎదుటే నిరసన హోరు వెల్లువెత్తింది.
హిందూపురంలో...
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమావేశం రసాభాసగా మారింది. సోమశేఖర రెడ్డి, మోహన్ రెడ్డి వర్గాలు రోడ్డెక్కాయి. పార్టీ ఇంఛార్జ్ పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మోహన్ రెడ్డిని ఇంఛార్జిగా నియమించడాన్ని సోమశేఖర రెడ్డి వర్గం వ్యతిరేకిస్తోంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొమ్మి లక్ష్మయ్యనాయుడు నియామకంపై మరో వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనకు దిగింది.












Click it and Unblock the Notifications