టిక్కెట్ నాక్కాకుండా ఎవరికిస్తారు?: విశాఖపై టిఎస్సార్

T Subbirami Reddy
విశాఖపట్నం తనదేనని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ టిక్కెట్ తనదేనని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి మరోసారి కుండబద్దలు కొట్టారు. విశాఖ ప్రజలకు 30 ఏళ్లుగా తాను సేవలందిస్తున్నానని, ప్రజలు తన వారని, విశాఖపట్నం తనదేనని, టిక్కెట్ కూడా తనదేనని, దీనిని ఎవరూ కాదనలేరని టిఎస్సార్ అన్నారు.

ఇంత ప్రజాసేవ చేసిన వారికి కాకుండా టికెట్ మరెవరికి ఇస్తారన్నారు. ఈసారి తనకు టిక్కెట్ ఖాయమన్నారు. మహిళా ఫోరం ఏర్పాటుపై శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి అధిష్ఠానం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.

వారు గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయిస్తారన్నారు. రెండుసార్లు విశాఖ నుంచి ఎంపీగా విజయం సాధించినా 2009లో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తాను పోటీ చేయకుండా, ఆ స్థానంలో కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరిని నిలపాల్సి వచ్చిందన్నారు.

రాజ్యసభ సభ్యులు లోక్‌సభకు పోటీ చేయరాదని నిర్ణయం తీసుకోవడం వల్లనే తాను అప్పట్లో పోటీ చేయలేదన్నారు. గతంలో పురందేశ్వరి నరసరావుపేట టికెట్ అడిగిన దరిమిలా, ఈసారి అక్కడ ఆమె, విశాఖపట్నంలో తాను భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+