స్పూర్తి అన్న రోజా, అవసరం నేర్పిస్తుందని విజయమ్మ

YS Vijayamma - Roja
గుంటూరు: తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మనే మహిళలందరికీ స్ఫూర్తి అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా ఆదివారం అన్నారు. గుంటూరు జిల్లాలోని బాపట్లలో మహిళ నగారా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయమ్మ, రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. భర్త వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయినా, తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నా ప్రజలకు అండగా విజయమ్మ నిలిచారని ప్రశంసించారు.

ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం, వారికి భరోసా ఇవ్వడం కోసం జగన్ సోదరి షర్మిల వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామగ్రామాన మద్యం బెల్ట్ దుకాణాలు పెరిగిపోయాయన్నారు. మద్యం మత్తులో వావివరుసలు కూడా మరిచి కొంతమంది అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం విజయమ్మ మాట్లాడుతూ.. చాలామంది తన పేరును, షర్మిల పేరును స్ఫూర్తిగా చెబుతున్నారని కానీ, అవసరం ఎవరికైనా ఏదైనా నేర్పిస్తుందని చెప్పారు. అనుకుంటే ఎవరైనా ముందుకు వెళ్లవచ్చునని అన్నారు. ఇటీవలి కాలంలో మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఆడపిల్లలు చదువుకోవాలని, ఉన్నతంగా ఎదగాలని వైయస్ రాజశేఖర రెడ్డి ఆశించారన్నారు. మహిళలకు వైయస్ ఇచ్చిన ప్రాధాన్యత ఎవరు ఇవ్వలేదన్నారు.

జగన్ కూడా ఆయన దారిలోనే నడుస్తారన్నారు. మద్యపాన నిషేధంపై జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారని, అధికారంలోకి వస్తే జగన్ బెల్టు షాపులను నిషేధిస్తానని చెప్పారన్నారు. మహిళలకు చదువు, అధికారం, రక్షణ ఇదే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నినాదం అన్నారు. వైయస్ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే వారననడానికి హోంమంత్రిగా మహిళను నియమించడమే మంచి ఉదాహరణ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+