వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిగా లేదు: రామ్ చరణ్ తేజ గొడవపై శ్రీకాంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikanth Reddy
హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ తేజ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి విమర్సించారు. రామ్ చరణ్ తేజపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ వ్యక్తిపై రామ్ చరణ్ తేజ చేయి చేసుకున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.

స్థాయి సంఘాల చైర్మన్ల నియామకంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని ఆయన విమర్సించారు. చైర్మన్ పదవులను ఇతర పార్టీలకు ఇవ్వకుండా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పంచుకున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వద్ద నిరసన తెలిపామని ఆయన చెప్పారు.

తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ తమ పార్టీకి ఒక్క చైర్మన్ పదవి కూడా ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. బడ్జెట్ స్టాండింగ్ కమిటీల చైర్మన్ పదవులను కాంగ్రెసు, టిడిపి పంచుకున్నాయని ఆయన విమర్సించారు.

బంజారాహిల్స్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ మురళి చెప్పిన వివరాల ప్రకారం...ఆదివారం రామ్ చరణ్ షాపింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా తాజ్ కృష్ణ హోటల్ వద్ద గల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద.....మారుతి ఆల్టో కారులో ఉన్న ఫనీష్, కళ్యాణ్‌లతో గొడవ పెట్టుకున్నారు. వారు రామ్ చరణ్ కారుకు సైడ్ ఇవ్వకపోవడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో రామ్ చరణ్ సహనం కోల్పోయారు.

English summary
The YSR Congress party MLA Gandikota srikanth Reddy has dissatisfied with the attitude of police in union minister Chiranjeevi's son and film hero Ram Charan tej incident in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X