ప్రియుడికి కాబోయే భార్యపై యువతి కత్తితో దాడి

Girl attack on Another girl
హైదరాబాద్: తాను ప్రేమిస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుంటుందనే కారణంతో ఓ యువతిపై హత్యాయత్నానికి పాల్పడింది మరో యువతి. బంజారాహిల్స్ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట్లకు చెందిన మమత అదే జిల్లాకు చెందిన దివ్యశ్రీ దగ్గరి బంధువులు. భర్తతో విడాకులు తీసుకున్న మమత.. మాదాపూర్‌లోని ప్రయివేటు కంపెనీలో పని చేస్తోంది.

దివ్యశ్రీ వరంగల్‌లో బి ఫార్మసీ చదువుతోంది. కుమార్ అనే యువకుడితో దివ్యశ్రీకి నిశ్చితార్థం జరిగింది. కుమార్‌ను మమత ప్రేమించింది. తాను ప్రేమించిన కుమార్‌ను దివ్యశ్రీ పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని మమత ఆమెకు అతని గురించి చెడుగా చెప్పింది. హైదరాబాదు వస్తే అతని గురించి సాక్ష్యాలు చూపిస్తానని రప్పించింది. మమత బలవంతంపై దివ్యశ్రీ శనివారం హైదరాబాదుకు చేరుకుంది. మమత ఆమెను తన సోదరి ఇంటికి తీసుకు వెళ్లింది.

కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామంటూ బెడ్ రూంలోకి తీసుకు వెళ్లింది. లోనికి వెళ్లగానే నేను ప్రేమిస్తున్న కుమార్‌ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? నీకు దక్కనివ్వనంటూ.. కూరగాయలు కోసే కత్తితో దివ్యశ్రీని పొడిచింది. తర్వాత బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయింది. దివ్యశ్రీ ఫోన్‌లో తనకు కాబోయే భర్త కుమార్‌కు, తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. వారు దివ్యశ్రీని ఆసుపత్రికి తరలించారు. మమతపై పోలీసులు ఐపిసి సెక్షన్ కింద్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

వివాహేతర సంబంధం: కూతుర్ని చంపిన తల్లి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ తల్లి అక్రమ సంబంధం కోసం కన్న కూతురునే హత్య చేసిన దారుణ సంఘటన జరిగింది. జిల్లాలోని సూళ్లూరుపేట మండలం వట్రపాలెంకు చెందిన అలివేలు అనే మహిళ అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని ఏడేళ్ల కూతురు జ్యోతిని హత్య చేసింది. తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయింది. స్థానికులు సమాచారం అందించటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+