ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ: బాబు హాజరు, ఆలస్యంగా చిరు
న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు స్పీకర్ మీరా కుమార్ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణకు కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి దంపతులతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దగ్గుపాటి పురంధేశ్వరి దంపతులు, చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న తదితర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
రాష్ట్రానికి చెందిన చిరంజీవి, కిల్లి కృపారాణి, బలరాం నాయక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులు, సురేష్ షెట్కార్, పొన్నం ప్రభాకర్, జైపాల్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, సర్వే సత్యనారాయణ, మంద జగన్నాథం, పల్లం రాజు, రాపోలు ఆనంద భాస్కర్, జయప్రద, మోహన్ బాబు, టిడిపి ఎంపీలు తదితరులు హాజరయ్యారు.

జాతీయ స్థాయి నేతల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో పాటు జ్యోతిరాదిత్య సింధియా, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, జైరామ్ రమేష్, బిజెపి అగ్రనేతలు ఎల్ కె అద్వానీ, రవిశంకర ప్రసాద్, అరుణ్ జైట్లీ, మురళీ మనోహర్ జోషీ, యుపి నేత ములాయం సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరు కాలేదు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కార్యక్రమానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications