లాలూకు గాయాలు: సీటు బెల్టు పెట్టాలని నితీష్ సలహా

ముందు సీటులో కూర్చున్న వారు తప్పకుండా సీటు బెల్టు పెట్టుకోవాలని, ఇది ట్రాఫిక్ నార్మల్ రూల్ అని ఆయన చురక వేశారు. తాను లాలూ ప్రసాద్ యాదవ్ ప్రమాదం అంశంపై వివరాలు తెప్పించుకున్నానని చెప్పారు. అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నానని చెప్పారు.
కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల ఓ చిన్న ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన కారులో వెళ్తుండగా కారు అద్దాలు తగిలి తలకు, ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి. శనివారం అతను తన వ్యక్తిగత కార్యదర్శితో కలిసి వైశాలి జిల్లాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
లాలూకు గాయాలు కావడంతో అతనిని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. ఇతని తలకు రెండు కుట్లు పడ్డాయి. ఈ ఘటన శనివారం రాత్రి పది గంటల సమయంలో జరిగిందని, రాఘవపూర్‌కు వెళ్లే దారిలో పాంటూన్ బ్రిడ్జి వద్ద జరిగిందని లాలూ పిఏ తెలిపారు.












Click it and Unblock the Notifications