జగన్ జోరుకు బ్రేక్‌లు: అంచనాతో తేరుకున్న బాబు

జగన్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ను తిరస్కరించడం, కర్ణాటక ఎన్నికల ఫలితాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల మనోధైర్యాన్ని దెబ్బ తీసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ రెండు పరిణామాలు ఆ పార్టీకి గట్టి దెబ్బ అని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న పార్టీలకు ఎదురు దెబ్బ తగిలిందని, మన రాష్ట్రంలో కూడా అదే జరుగుతుందని వారు అంటున్నారు.
వైయస్ జగన్ మాదిరిగానే కర్ణాటకలో యడ్యూరప్ప తీవ్ర స్ధాయిలో అవినీతి, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొన్నారని, అరెస్టయి జైలులో ఉన్నారనిస, బిజెపి నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారని, సామాజిక వర్గం బలం, సానుభూతితో నెగ్గుకు రావచ్చునని లెక్కలు వేశారని, అయినా ఫలితం దక్కలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి అనుచరుడు శ్రీరాములు కూడా ఇదే తరహాలో మరో పార్టీ పెట్టారు. కాని ఈ రెండు పార్టీలు చివరకు అడ్రస్ లేకుండా పోయాయి. తమిళనాడు, కర్ణాటక రెండు చోట్లా ప్రజల తీర్పు అవినీతికి వ్యతిరేకంగానే వచ్చింది. ఇక్కడ కూడా వాతావరణం క్రమంగా అదే రకంగా రూపు దిద్దుకొంటోందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
తాజా పరిణామాలు వైయస్ జగన్ ప్రభావాన్ని తగ్గుముఖం పట్టిస్తున్నాయని, ఆ పార్టీ గురించి గతం మాదిరిగా కంగారు పడే పరిస్థితి ఇప్పుడు లేదని తెలుగుదేశం నాయకులు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవడంపై టిడిపి వర్గాలు ఇప్పుడు దృష్టి పెట్టాయి. తమ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళిన కింది స్థాయి నేతలు, కార్యకర్తలను వెనక్కు తీసుకువచ్చే పనిలో ఆ పార్టీ నేతలు ప్రస్తుతం నిమగ్నమయ్యారు.












Click it and Unblock the Notifications