షర్మిల చిర్రుబుర్రు: తెలంగాణలో విజయమ్మ ఓదార్పు

ఇటీవలి దాకా దూరంగా ఉన్న పార్టీ నాయకుడు జలగం వెంకటరావు శుక్రవారం షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. పెనుబల్లి మండలం మండాలపాడులో రచ్చబండ నిర్వహిస్తుండగా జలగం అక్కడికి అనుచరులతో పాటు వచ్చారు. ఈ సందర్భంగా అనుచరులు జై జలగం అంటూ నినాదాలు చేశారు. దీంతో అసహనానికి గురైన షర్మిల ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి, పాదయాత్రను కొనసాగించారు.
తెలంగాణలో విజయలక్ష్మి ఓదార్పు
తెలంగాణలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆధ్వర్యంలో ఓదార్పు యాత్ర చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది. గతంలో జగన్ ఓదార్పు యాత్ర కోసం వరంగల్ జిల్లా మానుకోటకు పయనమైనప్పుడు, తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయన మధ్యలోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే.
తాజాగా విజయమ్మ ఈ యాత్రను కొనసాగించాలనుకుంటున్నారు. శుక్రవారం ఇక్కడ విజయలక్ష్మి అధ్యక్షతన ఆమె నివాసంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్థన్ మీడియాతో మాట్లాడుతూ - ప్రజల తరఫున మరిన్ని పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications