మాట మారిందేం?: కడియం వ్యాఖ్యలతో హర్టైన బాబు

తెలంగాణకు అనుకూలంగా టిడిపి స్పష్టమైన వైఖరి ప్రకటించిందని, పార్టీ వైఖరి పూర్తి అనుకూలంగా ఉందని ఆయనే బహిరంగంగా చెప్పారని, అప్పుడు కనిపించిన స్పష్టత ఇప్పుడు ఎటుపోయిందని, ఇప్పుడు కొత్తగా కనిపించిన అస్పష్టత ఏమిటని బాబు విస్మయం వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ తెలంగాణ నేతలు కొందరు బాబుతో భేటీ అయిన సందర్భంగా కడియం ప్రస్తావన వచ్చింది.
తెలంగాణలో ఆయన కంటే ముందు నుంచీ పార్టీలో పనిచేస్తున్న సీనియర్లున్నా వారిని కాదని కడియంకు మంత్రి పదవి ఇచ్చానని, పొలిట్‌బ్యూరో సభ్యుడిని చేశానని, ఎందరో సీనియర్లు అడిగినా కాదని అఖిలపక్షానికి పార్టీ ప్రతినిధిగా ఆయననే పంపానని, మొన్న కూడా వచ్చి కలిసినప్పుడూ ఇలాంటి అభిప్రాయమేదీ వ్యక్తం చేయలేదని నేతలతో చెప్పారట. గంటా రెండు గంటలు కూర్చుని అలా చేస్తే బాగుంటుంది.. ఇలా చేస్తే బాగుంటుందని సలహాలిచ్చి ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని, ఆయన చెప్పినవాటిలో పార్టీ ఏది కాదన్నదని, ఆయనకు ప్రతి విషయంలో పార్టీ సహకరించిందని చెప్పారు.
నాయకులు వచ్చినా వెళ్లినా... ప్రజలు అవినీతికి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకృతం అవుతున్న తరుణంలో ఇలా చేయడం బాధాకరమన్నారు. పోయినవాళ్ల గురించి వదిలేసి యువనాయకత్వాన్ని ప్రోత్సహిద్దామని, వీళ్లంతా పార్టీలోకి వచ్చినప్పుడు యువకులే అన్నారు.












Click it and Unblock the Notifications