షర్మిల తాతను మించి మాట్లాడుతున్నారు: పొంగులేటి

Ponguleti Sudhakar Reddy - Sharmila
హైదరాబాద్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ తప్పు పట్టారు. సిబిఐ పైన షర్మిల చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

షర్మిల తన తాతను మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోని కళంకిత మంత్రుల వ్యవహారాన్ని తమ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మంత్రులు పదవులు లేకున్నా పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

పేదవాడి అవసరాలు తీర్చడమే కాంగ్రెసు లక్ష్యం: గంటా

పేద ప్రజల అవసరాలు తీర్చడమే కాంగ్రెసు పార్టీ ధ్యేయమని మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదివారం అన్నారు. విశాఖపట్నం జిల్లా పరవాడ సంతబైల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు అందజేశారు.

గజల్ శ్రీనివాస్ చేరికపై నేతలు హర్షం

తెలుగు ప్రతిష్టను ప్రపంచానికి తెలియజేసిన గజల్ శ్రీనివాస్ కాంగ్రెసులో చేరటం సంతోషమని షబ్బీర్ అలీ అన్నారు. జగమెరిగిన పాటగాడు గజల్ శ్రీనివాస్ జాతీయవాదాన్ని సమర్థిస్తూ కాంగ్రెసులో చేరటం సంతోషకరమని మాజీ పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు.

ప్రజలు, గజల్స్ ప్రస్తుతం తన ముందున్న లక్ష్యాలు అని గజల్ కాంగ్రెసులో చేరిన సందర్భంగా అన్నారు. కాంగ్రెసుకు సేవ చేయడం దేశానికి సేవ చేయడమే అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఓ ప్రచార కార్యకర్తగా తీసుకు వెళ్తానన్నారు. కాంగ్రెసు హ్యాట్రిక్ సాధించేలా కృషి చేస్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+