మంత్రులపై తర్జన భర్జన: గవర్నర్‌కు టిడిపి ఫిర్యాదు

Sabitha Reddy and Dharmana Prasad Rao
హైదరాబాద్: కేంద్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కాంగ్రెసు పార్టీ అధిష్టానం తొలగించడం రాష్ట్ర కాంగ్రెసుకు కొత్త సమస్య తెచ్చి పెడుతోంది. అధిష్టానం వలే ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కళంకిత మంత్రుల విషయాన్ని అటో ఇటో తేల్చాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం కూడా భావిస్తోందట.

ఈ మేరకు ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయట. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని పునర్వ్యవస్థీకరించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గత నెలలో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనెల 17లోగా పార్టీ కమిటీలను ఖరారు చేయబోతున్నట్లు ఎంపీలతో రాహుల్ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ప్రకటించారు కూడా. రాహుల్ ఆదేశం మేరకు కమిటీల జాబితాతో మూడు రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను దేశ రాజధానిలోనే ఉండాలని అధిష్ఠానం తాజాగా ఆదేశించింది.

ఆజాద్‌ను ఇప్పటికే మూడుసార్లు కలిసిన బొత్స మరో దఫా సమావేశం కోసం ఢిల్లీలో వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం జాబితాపై బొత్సతో చర్చిస్తున్న సమయంలోనే ఆజాద్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండుసార్లు తన వద్దకు పిలిపించుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో రాష్ట్రంలోనూ అవినీతి మచ్చపడ్డ మంత్రులను తప్పించి కీలక మార్పులను చేపట్టేందుకు అధిష్ఠానం సిద్ధమవుతున్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు మంత్రులలో ఒకరైన మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే జైల్లో ఉండగా, ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిపై న్యాయస్థానాల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణలపైనా త్వరలోనే సిబిఐ చార్జిషీట్లను దాఖలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్రంలో ఇద్దరు మంత్రులను తొలగించిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులను కేబినెట్ నుంచి నుంచి తొలగించకపోవడం తప్పుడు సంకేతాలను పంపిస్తుందని పలువురు సీనియర్ నేతలు చెబుతున్నారట. వచ్చే ఎన్నికల్లో అవినీతి ప్రధానాస్త్రం కానున్న నేపథ్యంలో మంత్రులపై చర్యలకే అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు.

గవర్నర్‌ను కలువనున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలువనున్నారు. కళంకిత మంత్రులను తొలగించాలని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+