కుట్రలు వేర్వేరు, విచారణ వేర్వేరు: జగన్ కేసులో సిబిఐ

YS Jagan
హైదరాబాద్: తన ఆస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌కు సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. తన కేసులో అన్ని చార్జిషీట్లను కలిపి ఒకే విచారణ జరపాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ విజ్ఞప్తి వ్యతిరేకిస్తూ సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.

జగన్ ఆస్తుల కేసులో ఉమ్మడి విచారణ కుదరదని సిబిఐ చెప్పింది. నేరాలు వేర్వేరుగా ఉన్నాయని, విడివిడిగానే విచారణ జరపాల్సి ఉంటుందని సిబిఐ వాదించింది. కుట్రలు వేర్వేరుగా జరిగాయి కాబట్టి విచారణ కూడా వేర్వేరుగానే జరపాల్సి ఉంటుందని సిబిఐ వాదించింది. జగన్ కేసులో బ్రహ్మానంద రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదని సిబిఐ వాదించింది.

కాగా, జగన్ ఆస్తుల కేసులో జగన్, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను కోర్టు జూన్ 3వ తేదీ వరకు పొడగించింది.జగన్, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.

ఇదిలా వుంటే, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఒఎంసి డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి రిమాండ్‌ను కూడా కోర్టు జూన్ 3వ తేదీ వరకు పొడిగించింది. వీరిద్దరిని కూడా కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+