విజయమ్మతో సురేఖ భేటీ: రేపు జగన్‌తో చర్చలు

Konda Surekha couple
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినాయకత్వంపై అలిగిన మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఓ మెట్టు దిగి వచ్చినట్లే కనిపిస్తున్నారు. వారు సోమవారం సాయంత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో భేటీ అయ్యారు. పార్టీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి మధ్యవర్తిత్వం నెరిపి కొండా దంపతులతో చర్చలు జరిపారు. ఆయన చర్చల తర్వాత కొండా దంపతులు కాస్తా దిగి వచ్చారు.

వారిని తీసుకుని బాలినేని శ్రీనివాస రెడ్డి విజయమ్మ వద్దకు వెళ్లారు. కొండా దంపతులు దాదాపు 40 నిమిషాల పాటు విజయమ్మతో సమావేశమయ్యారు. పార్టీలో తమను అవమానిస్తున్న తీరును వారు ఆమెకు వివరించారు. తమ వర్గానికి చెందిన నలుగురిపై తమకు చెప్పకుండా వేటు వేయడాన్ని కూడా వారు ప్రశ్నించినట్లు చెబుతున్నారు. పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోతే ఉండబోమని వారు స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది.

పార్టీలో తమకు అవమానం జరుగుతోందని వారు చెప్పినప్పుడు ఆ విషయాలు తమకు తెలియవని విజయమ్మ అన్నట్లు తెలుస్తోంది. తాము చెప్పినా పట్టించుకోలేదనే విషయాన్ని వారు గుర్తు చేసినట్లు చెబుతున్నారు. వారి డిమాండ్లకు విజయమ్మ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. కొండా దంపతులు రేపు (మంగళవారం) వైయస్ జగన్‌ను చంచల్‌గుడా జైలులో కలువనున్నారు.

జగన్‌తో భేటీ అయిన తర్వాతే వారు పూర్తిగా అలక వీడారా, లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. కొండా దంపతుల డిమాండ్లపై జగన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది విషయంపై అది ఆధారపడి ఉంటుంది. త్వరలో తెలంగాణ ప్రాంతంలో వైయస్ విజయమ్మ ఓదార్పు యాత్ర చేపట్టాలని అనుకుంటున్నారు. ఈ స్థితిలో కొండా దంపతులు పార్టీలో కొనసాగేలా చూసేందుకే జగన్ కూడా మొగ్గు చూపే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. రేపు అన్ని విషయాలు జగన్‌తో చర్చిస్తామని కొండా దంపతులు చెప్పారు.

కొండా దంపతులను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు బిజెపి కూడా ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొండా దంపతులు పార్టీ నుంచి వెళ్లిపోతే జరిగే నష్టం గురించి ఆలోచనకు వచ్చిన వైయస్ జగన్ వారితో చర్చలకు బాలినేని శ్రీనివాసరెడ్డిని నియోగించారు. చివరకు ఆయన మంతనాలు ఫలించినట్లే కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+