జగన్‌కు పిటి వారంట్: సబితకు కోర్టు సమన్లు జారీ

సబితా ఇంద్రారెడ్డి ఈ కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్నారు. రెండో నిందితుడుగా విజయసాయి రెడ్డి, మూడో నిందితుడిగా పుణీత్ దాల్మయా, ఐదో నిందితురాలిగా ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఆరో నిందితుడిగా రాజగోపాల్, ఏడో నిందితుడిగా సజ్జల దివాకర్ రెడ్డి, ఎనిమిదో నిందితుడిగా సంజయ్ ఎస్ మిత్రా, తొమ్మిదో నిందితుడిగా నీల్ కమల్ ఉన్నారు. పదో నిందితుడిగా జయదీప్ బసు ఉన్నారు. 11, 12, 13 నిందితులుగా రఘురామ్ సిమెంట్స్, ఈశ్వర్ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ ఉన్నాయి.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రి పనిచేశారు. ఈ సమయంలో దాల్మియా సిమెంట్స్‌కు సున్నంరాయి కేటాయింపులు జరిగాయి. ఆ కేటాయింపులకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ వైయస్ జగన్ సంస్థల్లో 95 కోట్ల రూపాయలు పెట్టిందనేది సిబిఐ అభియోగం.
సిబిఐ దాల్మియా సిమెంట్స్‌పై 67 పేజీల చార్జిషీట్‌ను రూపొందించింది. మొత్తం 47 మందిని సాక్షులుగా చేర్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిందని, ఫలితంగా జగన్ కంపెనీల్లో 95 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిందని సిబిఐ ఆరోపిస్తోంది. కడప జిల్లా మైలవరం వద్ద దాల్మియా సిమెంట్స్‌కు 407 హెక్టార్ల సున్నంరాయి గనులను 30 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టారు. దాల్మియా సిమెంట్స్ జగన్‌కు భారతి సిమెంట్స్‌లో 50 కోట్ల రూపాయలు, జగతి పబ్లికేషన్స్‌లో 45 కోట్లు రూపాయలు పెట్టుబడులుగా పెట్టిందని ఆరోపణ.












Click it and Unblock the Notifications