త్వరలో ఊహాగానాలకు తెర: సోనియాతో రఘువీరా భేటీ

Raghuveera Reddy
న్యూఢిల్లీ: రాష్ట్రానికి సంబంధించి అన్ని ఊహాగానాలకు త్వరలోనే తెర పడుతుందని రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలకు, ఊహాగానాలకు సోనియా గాంధీ త్వరలోనే తెర దించుతారని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీకి మంచి జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పార్టీని కాపాడాలనే కృత నిశ్చయంతో సోనియా గాంధీ కనిపించారని, పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో ఉన్నట్లు అనిపించారని ఆయన అన్నారు. పార్టీని రాష్ట్రంలో గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పార్టీ, ప్రభుత్వ స్థితిగతులపై ఆయన సోనియాకు ఓ నివేదిక సమర్పించారు.

పార్టీ స్థితిగతులపై తాను సోనియాతో చర్చించానని, రాష్ట్రానికి సంబంధించి పూర్తి సమాచారం అందించానని ఆయన చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా సోనియా గాంధీ త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో గత కొద్దికాలంగా రఘువీరా రెడ్డి విభేదిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సోనియాతో భేటీకి ప్రాధాన్యం చేకూరింది.

కేంద్రంలో అశ్వినీ కుమార్, పవన్ కుమార్ బన్సల్ రాజీనామాలు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులపై చర్యలకు సోనియా గాంధీ పూనుకోవచ్చునని భావిస్తున్నారు. పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ భారీ మార్పులు ఉండవచ్చునని కూడా అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+