జగన్ ఏడాదిని తిరిగివ్వగలరా, ఆ చిలుకెవరో?: షర్మిల

Sharmila
ఖమ్మం: తన సోదరుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐని ఎవరు ఆడిస్తున్నారో తేలాల్సి ఉందని ఆయన సోదరి షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో అన్నారు. జగన్ కేసులో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల ప్రభావం ఎంతో తేలాల్సి ఉందన్నారు. సుప్రీం కోర్టు ఈ కేసులో జోక్యం చేసుకొని సమగ్ర దర్యాఫ్తునకు ఆదేశించాలని కోరారు.

కోల్ గేట్ వ్యవహారంలో సిబిఐ నివేదికను కేంద్రంలోని పెద్దలు తమకు అనుకూలంగా మార్చుకున్నారని, ఇలా ఎన్ని కేసుల్లోని నివేదికల్లో కాంగ్రెసు నేతలు మార్పులు చేశారో తేలాలన్నారు. సాక్ష్యులను ప్రభావితం చేస్తారంటూ ఏడాదిగా జగన్‌ను జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యాలను తారుమారు చేసే అధికారం, అవకాశం ఉన్న మంత్రులను అరెస్టు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

కేంద్రం ఎలా చెప్తే సిబిఐ అలా చేయాల్సి ఉంటుందని, కేంద్రం పంజరంలో తాము చిలుకలం అని, కేంద్రం పలికించినట్టు సిబిఐ పలకాల్సి ఉంటుందని ప్రస్తుత సిబిఐ డెరైక్టరే స్వయంగా చెప్పారని, జగన్ కేసులో ఈ సిబిఐ అనే చిలుకను ఎవరు పలికిస్తున్నారో నిగ్గు తేలాలని, ఎవరు ఎలా నడిపిస్తున్నారో.. ఎవరు ఎలా ఆదేశిస్తున్నారో.. ఎవరు ఎలా ఆడిస్తున్నారో తేలాల్సి ఉందన్నారు. మన దేశంలో రాబోయే రోజుల్లో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మళ్లీ ఇలా సిబిఐని ఉసిగొల్పి అమాయకులను వేధించకుండా ఉండాలంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐని ఉపయోగించి అమాయకులను ఎంత దుర్మార్గంగా వేధించి పబ్బం గడుపుకొంటుందనే విషయం మీద విచారణ జరగాలన్నారు.

జగన్ బయట ఉన్నప్పుడు ఏ ఒక్కరోజైనా, ఏ ఒక్క సాక్షినైనా ప్రభావితం చేశారా? కనీసం అలాంటి ప్రయత్నం చేశారని నిరూపించగలరా? అని అడిగితే సిబిఐ దగ్గర నుంచి సమాధానం లేదన్నారు. జగన్‌ని ఇప్పటికీ దోషి అని నిర్ధారించకుండానే సంవత్సర కాలంగా జైల్లో పెట్టారని, నేరం నిర్ధారణ కాకుండానే ఆయనకు శిక్ష వేసినట్టు కాదా? ఒక వ్యక్తిని దోషి అని నిర్ధారించకుండానే ఇన్ని రోజులు జైల్లో పెట్టొచ్చని ఏ చట్టం, ఎక్కడ చెప్తుంది? తీరా కేసు అయిపోయాక జగనన్న నిర్దోషి అని తేలాక జగన్ కోల్పోయిన ఈ ఏడాది కాలాన్ని ఈ కుట్రదారులు వెనక్కి ఇవ్వగలరా? జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఈ కాంగ్రెస్, టిడిపిలకు లేదన్నారు. అందుకనే సిబిఐ వెనుకాల దాక్కొని దాడి చేస్తున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+