బాంబే పేలుళ్లు, కార్గిల్ రిపీట్ కానివ్వం,: నవాజ్ షరీఫ్

అమెరికా, భారత్, ఆఫ్ఘనిస్తాన్‌లతో సంబంధాలు మెరుగుపర్చుకుంటామన్నారు. మిలిటరీతో ఎలాంటి సమస్య లేదన్నారు. 1999లో కార్గిల్ దాడికి సంబంధించి మాట్లాడుతూ... ఇందులో మిలిటరీని తప్పు పట్టాల్సింది ఏమీ లేదని, అప్పుడు జరిగిందానికి ముషారఫ్ బాధ్యుడని చెప్పారు. ఈ విషయంలో మిలిటరీని నిందించాల్సిన అవసరం లేదన్నారు. కార్గిల్ తరహా ఘటనలు మరలా జరగకుండా చూసుకుంటామని, బాంబే పేలుళ్ల ఘటనలు కూడా రిపీట్ కానివ్వమని ఆయన చెప్పారు.
సత్సంబంధాలు: ప్రకాశ్ కరత్
పాకిస్తాన్‌లో ప్రజామోద ప్రభుత్వం ఏర్పడబోతుందని లెఫ్ట్ పార్టీ అగ్రనేత ప్రకాశ్ కరత్ ఢిల్లీలో అన్నారు. పాక్ - భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆయన ఆకాంక్షించారు. మన దేశంలో ఉరిశిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు మంత్రులను తొలగించినంత మాత్రాన 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం కేసులో ప్రభుత్వం తప్పు చేయనట్లు కాదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటిని తగ్గించే చర్యలు చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications