వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంజయ్ లొంగుబాటు: టాడా కోర్టులోనే, పూణేలో కాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sanjay Dutt
ముంబై: 1993 ముంబై పేలుళ్ల దోషి అయిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురువారంనాడు టాడా కోర్టులోనే లొంగిపోనున్నారు. మిగతా జైలు శిక్ష అనుభవించడానికి ఆయన ఈ నెల 16వ తేదీలోగా లొంగిపోవాల్సి ఉంది. పూణేలోని యెరవాడ జైలులో లొంగిపోతానని తాను పెట్టుకున్న దరఖాస్తును సంజయ్ దత్ ఉపసంహరించుకున్నారు.

తన దరఖాస్తును ఉపసంహరించుకోవడానికి టాడా కోర్టు బుధనవారం సంజయ్ దత్‌కు అనుమతి ఇచ్చింది. తనకు స్వార్థ శక్తుల నుంచి, ఛాందసవాద గ్రూపుల నుంచి ముప్పు ఉందని చెబుతూ యెరవాడ జైలులో లొంగిపోవడానికి అనుమతి ఇవ్వాలని టాడా కోర్టును కోరారు.

1993 ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవించడానికి లొంగిపోయేందుకు మరింత గడువును ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సంజయ్ దత్‌తో సినిమా తీస్తున్న ఇద్దరు నిర్మాతలు తమ సినిమాలు పూర్తి చేసుకోవడానికి వీలుగా లొంగిపోయేందుకు సంజయ్ దత్‌కు మరింత గడువు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంజయ్ దత్ దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇదివరకే తోసిపుచ్చింది.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. 1993 వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు మే 10వ తేదీన సంజయ్ దత్ రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఇతర ఆరుగురు దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

English summary
Sanjay Dutt will surrender on Thursday before a special TADA court here to undergo his remaining jail term in the 1993 Mumbai blasts case, according to his lawyer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X