రాజకీయాలకు డుమ్మా కొట్టానంటూ సోనియా చలోక్తులు

మంగళవారం కళాశాలకు వెళ్లి విద్యార్థులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆమె అద్భుతమైన విశ్వవిద్యాలయంలో మీతో మాట్లాడటం సంతోషాన్నిస్తోందని, విద్యార్థులతో కాసేపు గడిపే అవకాశం తరుచూ వచ్చేది కాకపోవడం ఇందుకు ఒక కారణమైతే, తన రాజకీయ తరగతికి ఈ కాస్త సమయమైనా డుమ్మా కొట్టగలగడం మరొకటి అంటూ ఆమె చమత్కరించారు.
కాగా, మహిళలు, బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలను నిరోధించడంలో సమాజం వైఫల్యం చెందడం తనను ఎంతగానో బాధించిందని సోనియా గాంధీ ఈ సందర్భంగా అన్నారు. వీధుల్లోనే కాకుండా సొంత ఇంటిలోను మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలపై ఆకృత్యాలను నిరోధించండానికి ప్రభుత్వం, పార్లమెంటు రక్షణ వ్యవస్థలు తమ విధులను నిర్వర్తిస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ మహిళలపై ఆగడాలకు అంతులేకుండా పోతోందని, సమాజం కూడా తన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications