వారే లాభపడ్డారు, వైఎస్ చెప్పారనే: జగన్‌పై ఆనం మళ్లీ

Anam Ramanarayana Reddy
విజయవాడ: వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని జివోల వల్ల మంత్రులు ఎవరు లాభపడలేదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయనకు సంబంధించిన మీడియా సంస్థలు, కొంతమంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మాత్రమే లాభపడ్డారని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం విజయవాడలో ఆరోపించారు. వైయస్ కుటుంబం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కాంగ్రెసు పైన బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు.

తెర వెనుక బాగోతాలతో మంత్రులకు సంబంధం లేదన్నారు. వైయస్ చెప్పినందు వల్లే నాడు వివాదాస్పద జివోలపై మంత్రులు సంతకాలు చేశారన్నారు. సంతకాలు చేసిన మంత్రులు లాభపడలేదన్నారు. తప్పు చేసింది జగన్ అని, వారే లాభపడ్డారన్నారు. నిజాలు చెప్పడానికి ఇప్పుడు వైయస్ మన మధ్య లేడన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వైయస్ కుటుంబ సభ్యులే లాభపడ్డారన్నారు.

తమ తప్పు లేదని కాదని అయితే తెలియకుండా చేసింది మాత్రమే అన్నారు. మంత్రులపై అధిష్టానం చర్యలకు తాము కట్టుబడి ఉంటామన్నారు. వైయస్ బొమ్మ పెట్టుకొని ఎవరు రాజకీయం చేస్తున్నారో వారికే నష్టమన్నారు. వైయస్ హయాంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ రూ.500 కోట్ల బకాయిలు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చెల్లించిందని ఆయన చెప్పారు.

కిరణ్‌కు ధైర్యం లేదన్న రాఘవులు

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. కళంకిత మంత్రులను తొలగించే ధైర్యం ముఖ్యమంత్రికి లేదన్నారు. ఒకరిపై మరొకరు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసేందుకే సమయం సరిపోతుందన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది కాంగ్రెసు పార్టీయే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+