షర్మిలని రెండే నడిపిస్తున్నాయి: రోజా, విశాఖలో చిచ్చు

షర్మిలను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు... ఈ రెండే నడిపిస్తున్నాయని ఆమె అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోందన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా షర్మిల ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర చేస్తున్నారన్నారు.
షర్మిల పాదయాత్రలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల బుధవారం అధికార పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమది రైతు ప్రభుత్వమని చంకలు చర్చుకుంటున్నారని, ఎలా రైతు ప్రభుత్వం అయిందో చెప్పాలని ప్రశ్నించారు. పంటలు ఎండినందుకా, పంట పొలాలకు నీరు ఇవ్వనందుకా, పంటలకు మద్దతు ధర రానందుకా ఎందుకు రైతు ప్రభుత్వం అయిందో చెప్పాలన్నారు.
విశాఖలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల బాహాబాహీ
విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గం పరిధిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఇరు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications