నితీష్‌పై లాలు 'చిలుక' పలుకు: ఆకర్షణగా తనయులు

పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌లో బుధవారం భారీ 'పరివర్తన' ర్యాలీని లాలూ న్విహించారు. లాలూ కుమారులు తేజ్‌ప్రతాప్, తరుణ్‌ల రాజకీయ ఆరంగేట్రానికి వేదికగా ఈ ర్యాలీ నిర్వహించారు. గత దశాబ్దకాలంలో ఇంతటి భారీ సభను ఆర్జేడి ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
తాను నిజమైన సెక్యులర్‌వాదినని లాలు స్పష్టం చేశారు. మతతత్వవాదులను ఢిల్లీ గద్దె ఎక్కనీయకుండా అడ్డు పడతానని పేర్కొన్నారు. నితీష్ నియంత అని, ఆయన పతనం మొదలైందని, నితీష్ లౌకిక విలువలు సందేహాస్పదమని, ఆయన ఆర్ఎస్ఎస్, బిజెపి ఒడిలో కూర్చున్న చిలుకలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా విమర్శించారు.
ఎన్డీయే పాలనలో బీహార్ ప్రజలు అవినీతి, నేరాలతో విసుగెత్తిపోయారని, ఆ కూటమి పాలనను ఏవగించుకున్నారని, ఎన్డీయే సర్కారు పతనం వారి స్వయంకృపారాధమే అన్నారు. నితీష్‌ను గద్దె నుండి కిందకు తోస్తానని అన్నారు. ఆర్జెడి సభలో లాలు తనయుడు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వారిని వెలుగులోకి తీసుకు రావడానికి సభను సాధనంగా వాడుకున్నారు. ఆర్జెడి వ్యవహారాల్లో వారి ఆసక్తిని లాలు సభాముఖంగా సమర్థించుకున్నారు. తన కుమారులు పార్టీ గుర్తు లాంతరు పట్టుకుంటే తప్పేంటని, వారు లాంతరు కాకుండా కమలాన్ని, బాణాన్ని పట్టుకోవాలా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications