'విజయశాంతి ఇంట్లో హరీష్‌కు పద్మాలయ 80లక్షలు'

తెరాస సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు గతంలో పద్మాలయ స్టూడియో పైన పిటిషన్ వేశారని, ఆ తర్వాత మాత్రం ఆయన దానిపై పెదవి విప్పలేదని ఆరోపించారు. దీనికి కారణమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. పద్మాలయ పైన పిటిషన్ వేసి హరీష్ రావు వారిని బ్లాక్ మెయిల్ చేశారన్నారు. తద్వారా హరీష్‌కు రూ.80 లక్షలు ముట్టాయన్నారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఇంట్లోనే పిటిషన్ పైన చర్చ జరిగిందని, ఆమె ఇంట్లోనే సెటిల్మెంట్ జరిగిందని ఆరోపించారు. దీనిపై తాను సిబిఐకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పద్మాలయ ప్రతినిధులు డబ్బుల సంచులతో విజయశాంతి ఇంటికి వచ్చారన్నారు. విజయశాంతి భర్త, మరో నిర్మాత సమక్షంలోనే సెటిల్మెంట్ జరిగిందన్నారు.
తాను న్యాయపోరాటం చేస్తానని, అందుకు తెరాస అధిష్టానం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తాను ఇచ్చిన గడువు పూర్తయినా వారు బయటకు రాలేదంటే వారి వద్ద తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవనే అర్థం అన్నారు. తనపై ఆరోపణలు వారు ఎందుకు రుజువు చేయలేకపోయారన్నారు. తెరాసకు రెండు మూడు రోజుల్లో తాను లీగల్ నోటీసులు ఇస్తానని చెప్పారు. సమయం ఇస్తే తప్పును సరిదిద్దుకుంటారని చూశానని అన్నారు.
గతంలో యెన్నం శ్రీనవాస్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, చంద్రశేఖర్‌లు కోర్టులో తెలంగాణ భవన్ పైన పిటిషన్ వేస్తే వారు ఆ భవనంలో పార్టీ కార్యక్రమాలు జరుపుకోవచ్చునను కోర్టు తీర్పు చెప్పిందన్నారు. ఈ రోజు ఓ ఛానల్‌లో తెరాసకు చెందిన ఓ నేత రాజకీయాల్లో అందరు సంపాదించుకున్నారని అలాగే తాము సంపాదించుకున్నామని చెప్పారని ఆరోపించారు. తెలంగాణ పేరుతో డబ్బులు సంపాదించుకుంటున్నామని వారే చెప్పారన్నారు. ఇది తాను కెసిఆర్ చెప్పినట్లుగానే భావిస్తున్నానని అన్నారు.
తాను న్యాయపోరాటం చేస్తానని వారు సిద్ధంగా ఉండాలన్నారు. తాన ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పే హరీష్ రావు... పద్మాలయను బ్లాక్ మెయిల్ చేసి విజయశాంతి ఇంట్లో సెటిల్మెంట్ చేసుకొని రూ.80 లక్షలు తీసుకున్నారన్నారు. ఇందులో ఎవరి వాటా ఎంతో తనకు తెలియదన్నారు. దీనిపై తాను కోర్టుకు వెళ్తానని చెప్పారు. తెరాస నేతలు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
మేము పదమూడేళ్ల నుండి జెండాలు మోసి టిక్కెట్లు అడిగితే తప్పేమిటన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి డబ్బులు తీసుకొని ఇవ్వడమేమిటన్నారు. తనకు తెరాస నుండి బెదిరింపులు వచ్చినా భయపడేది లేదన్నారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తానన్నారు. తెలంగాణ పేరుతో తాను ఎవరి వద్ద నుండైనా డబ్బులు వసూలు చేస్తే వారు ముందుకు రావొచ్చన్నారు.












Click it and Unblock the Notifications