స్పాట్ ఫిక్సింగ్: చెన్నైలో ఐదుగురు బుక్కీల అరెస్టు

మరో ముగ్గురు తప్పించుకున్నట్లు సమాచారం. తప్పించుకున్నవారిలో ఒకతను దక్షిణాఫ్రికాకు చెందినవాడని తెలుస్తోంది. మొత్తం 8 మంది మొదటి పోలీసు రాడార్ పరిధిలోకి వచ్చారు. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలలతో పాటు 14 బుక్కీలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత చెన్నై కేంద్రంగా దర్యాప్తు ప్రారంభమైంది.
గత దశాబ్ద కాలంగా నడుస్తున్న బెట్టింగ్ వ్యవహారాన్ని చెన్నై పోలీసులు ఛేదించారు. బిల్లులతో పాటు బెట్టింగ్‌కు సంబంధించి సొమ్ము ముట్టజెప్పిన, తీసుకున్న వివరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రూ.14.3 లక్షల నగదును, ఐదు ల్యాప్‌టాప్‌లను, రెండు డెస్క్‌టాప్‌లను, ఆరు లాండ్‌లైన్ ఫోన్లను, ఆరు వైర్‌లెస్ ఫిక్స్‌డ్ ల్యాండ్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాకు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌ల్లోని మ్యాచ్ ఫిక్సర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఆటగాళ్లతో సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న సంబంధాలతో వారు వ్యవహారాలు నడుపుతున్నట్లు చెప్పారు.
ముఠా సభ్యులు వేదాచలానికి చెందిన చెన్నైలోని వెస్ట్ జోన్స్ రోడ్డులో గల గ్యాంబ్లింగ్ డెన్‌లో కలుస్తూ ఉండేవారు. క్రికెట్ బెట్టింగ్ కోసమే ఓ వైర్డ్ గదిని కేటాయించారు. లేదంటే మౌంట్ రోడ్డులోని పాపులర్ కాఫీ షాప్‌లో వాళ్లు కలుస్తుండేవారు.
బెట్టింగ్ సూత్రధారుల్లో ఒక్కడైన ప్రశాంత్ పోలీసులు ఆయనవరంలోని తన దర్శన్ రెసిడెన్సీలోకి పోలీసులు రావడానికి ముందే పసిగట్టి పారిపోయాడు. బుక్కీల నుంచి అతను 25 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేస్తుండేవాడు. బెట్టింగ్‌తో పాటు క్లయింట్లకు న్యాయపరమైన సహాయం అందిస్తుండేవాడు.












Click it and Unblock the Notifications