పేసర్ శ్రీశాంత్ ఏవేవో చేశాడు: అన్నీ హుష్‌కాకే

తన క్రికెట్ సహచరులు రాబిన్ ఊతప్ప, రంజీ ట్రోఫీ మాజీ ఆటగాడు జెకె మహింద్రాలతో కలిసి శ్రీశాంత్ 2007లో కొచ్చి, బెంగళూర్‌ల్లో బ్యాట్ అండ్ బాల్ ఇన్‌ను ప్రారంభించాడు. దీంతో శ్రీశాంత్ హోటల్ బిజినెస్‌లో అదరగొడుతాడని అందరూ భావించారు. కానీ అది ముందుకు సాగలేదు. లాభాలు రాబట్టలేకపోయాడు.
మ్యూజిక్ బ్యాండ్‌ను కూడా శ్రీశాంత్ ఎన్నో ఆశలతో ప్రారంభించాడు. కానీ అదీ మూలన పడే పరిస్థితి వచ్చింది. మ్యూజిక్ బ్యాండ్ చివరి సారి నిరుడు ఐపియల్ సీజన్ సందర్భంగా జైపూర్‌లో ప్రదర్శన ఇచ్చింది. తొలి ప్రదర్శన కర్టెన్ రైజర్ 2011 జనవరి 30వ తేదీన జెటిపిఎసిలో ఇచ్చారు.
శ్రీశాంత్ బ్రాండ్ వాల్యూ కూడా తగ్గుతూ వచ్చింది. రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక సంస్థలు కాంట్రాక్టులను కొనసాగించడానికి వెనకాడాయి. శ్రీశాంత్ ముథూట్ పపచన్ గ్రూప్, మదర్ కన్సక్షన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీశాంత్ వ్యవహరించాడు. ఈ రెండు కూడా కాంట్రాక్టులను రద్దు చేసుకున్నాయి. ప్రస్తుత వివాదంతో శ్రీశాంత్ కెరీర్ ముగిసే సూచనలే కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications