కేంద్ర పరిశీలనలో తెలంగాణ, మీకే ఆతురత: బొత్స

ఈ నెల 22వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. జిల్లా, మండల, బ్లాక్ స్థాయి నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతం చేసే విషయంపై, ప్రభుత్వ పథకాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చిస్తామని బొత్స సత్తిబాబు చెప్పారు. పార్టీ సమావేశాల్లో తెలంగాణపై స్పందించాలని అనడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై చర్చించడానికి పిసిసి కార్యవర్గం ఉందని ఆయన చెప్పారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇటీవల ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చించిన విషయం తెలిసిందే. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధిష్టానం నాయకులు బొత్స సత్యనారాయణకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 22వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం హైదరాబాద్ తిరిగి వచ్చారు.












Click it and Unblock the Notifications