రఘునందన్ రావుపై కడియం ఫైర్, 48 గం.ల డెడ్ లైన్

పరుశురాం హత్యకు తనకు, తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. హత్యలు, అవినీతి, భూకబ్జాలకు తాను ఎప్పుడు దూరంగా ఉన్నానని చెప్పారు. ఇప్పగూడెం హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు కూడా తనపై ఇలాంటి నీచాతినీచమైన హత్యారోపణలు తనపై ఎప్పుడు చేయలేదన్నారు. రఘునందన్ తనపై ఆరోపణలు చేయడం చూస్తుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదని అర్థమవుతోందన్నారు.
పరుశురాంను సిపిఎం కార్యకర్తలు హత్య చేశారని, ఈ హత్య 2003లో జరిగిందని, అప్పుడు ఇప్పగూడెం జనగామ నియోజకవర్గంలో ఉందన్నారు. హత్యగావింపబడ్డ పరుశురాం గతంలో సిపిఎంలో పని చేసి తర్వాత తెరాసలోకి వచ్చారన్నారు. ఈ హత్యకు సంబంధించి 17 మంది సిపిఎం కార్యకర్తలపై కేసు నమోదయిందని, వారు ఇప్పటికి అదే పార్టీలో కొనసాగుతున్నారని ఆయన చెప్పారు.
పరుశురాం హత్యకు సంబంధించి తెరాస తనపై అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆరోపణలు చేయలేదన్నారు. రఘు మాత్రం తెరాస నుండి బయటకు వెళ్లాక ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తనపై హత్యా రాజకీయ ఆరోపణలు చేసిన రఘునందన్‌కు తాను 48 గంటల సమయం ఇస్తున్నానని, అప్పటిలోగా సాక్ష్యాలు బయట పెట్టాలని లేదా తనపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే తాను చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు.
తాను తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆయన చేసిన ఆరోపణలపై స్పందించడం లేదన్నారు. తనకు తెలియని విషయాల గురించి తాను మాట్లాడనన్నారు. కానీ తనపై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ బలోపేతం కోసం ఓ ముఖ్యనేత పార్టీలో చేరితే ఆహ్వానించాల్సింది పోయి అడ్డుకోవడం విడ్డూరమన్నారు.












Click it and Unblock the Notifications