కుటుంబాన్ని ఒకే వేదికపైకి తేనున్న హీరో కల్యాణ్‌రామ్!

ఈ కార్యక్రమానికి అతను తన మావయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తండ్రి నందమూరి హరికృష్ణ, బాబాయ్ నందమూరి బాలకృష్ణ, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్‌లను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను వారికి పంపించారు. ఓం చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరులోగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో కల్యాణ్ రామ్ కుటుంబాన్ని కూడా ఒకే వేదిక పైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.
నారా - నందమూరి కుటుంబాల మధ్య విభేదాలున్నట్లుగా కొంతకాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు చంద్రబాబు, బాలకృష్ణల పైన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. హరికృష్ణ పలుమార్లు తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఇటీవల న్యూఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నందమూరి - నారా కుటుంబాలు ఒకే వేదిక పైకి వచ్చాయి. లక్ష్మీ పార్వతి, పురంధేశ్వరి, చంద్రబాబు, జూనియర్ సహా అందరు ఒకే వేదికపై కనిపించారు. ఇప్పుడు కల్యాణ్ రామ్ బాబు, బాలయ్య, హరి, జూనియర్‌లను ఒకే వేదికపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications